కార్మికుల సమ్మె విజయవంతం చేయాలని చైర్మన్ కు వినతి పత్రం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మున్సిపల్ కార్మికులు ఈనెల 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ ర్మన్ వెన్ రెడ్డి రాజు కు సోమవారం వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు తమకు ఉన్నటువంటి సమస్యలను చైర్మన్ తో విన్నవించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా మాట్లాడుతూ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కనీస వేతనం అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు.ఇకనైనా నూతన ప్రభుత్వం కనీస వేతనం అమలు చేసి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్ సీపీఎం పట్టణ మాజీ కార్యదర్శి దండ అరుణ్ కుమార్ సీఐటియు జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు, కొంతం శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, అన్నపూర్ణ, శ్రీలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love