నేడు పీజీఈసెట్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, ఫార్మా-డీ(పీబీ) కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఈనెల 10 నుంచి 13 వరకు నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయెట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) రాతపరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లోని జేఎన్టీయూ హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, జేఎన్టీయూహెచ్‌ వీసీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, జేఎన్టీయూహెచ్‌ రెక్టార్‌ విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు విడుదల చేస్తారని పీజీఈసెట్‌ కన్వీనర్‌ ఎ అరుణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఈసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 22,712 మంది దరఖాస్తు చేయగా, వారిలో 20,626 (90.82 శాతం) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Spread the love