ఆన్‌లైన్‌లో మారని..అధికారుల ఫోన్‌ నెంబర్లు, పేర్లు

– జిల్లా అధికారుల ఫోన్‌ నెంబర్ల కోసం ప్రజలు వెతుకులాట
నవతెలంగాణ-అచ్చంపేట
పాలన విధాన్ని ప్రజలకు చేరువ తీసుకురావ డానికి నూతన జిల్లాలు రెవె న్యూ డివిజన్‌ కేంద్రాలు మండలాలు గ్రామపంచాయతీలు ఏర్పాటు అయ్యా యి. నాగర్‌కర్నూలు జిల్లా అధికారులు పేర్లు, ఫోన్‌ నెంబర్ల కోసం ఆన్‌లైన్‌లో వింత వెతికిన లభించడం లేదు. పాత అధికారుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు మాత్ర మే ఉన్నాయి. నూతన జిల్లాల అధికారుల ఫోన్‌ నెంబర్లు ఆన్‌లైన్‌లో పెట్టవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దీంతో జిల్లా అధికారుల ఫోన్‌ నెంబర్ల కోసం వివిధ గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం నూతనంగా ఏర్పడిన తర్వాత సెకండ్‌ విడత అధికారంలోకి రావడంతో కొత్త మండలాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా ఆన్‌లైన్‌లో జిల్లా అధికారుల ఫోన్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం నూతనంగా పార్లమెంటు ఎన్నికలు ఫలితాలు కూడా వచ్చాయి. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా గతంలో అశోక్‌ విధులు నిర్వహించాడు. ప్రస్తుతం ఇంకా అతని పేరు ఆన్‌లైన్‌లో ఉంది. జిల్లా పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ నిర్వహించారు. ప్రస్తుతం అతని పేరే ఉంది. ఇలా జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, జిల్లా రవాణాశాఖ అధికారి, ఐటీడీఏపీఓ, జిల్లా స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, జిల్లా ఆడిట్‌ అధికారి ఇలా దాదాపు అన్ని శాఖల అధికారులు మారినప్పటికీ వాళ్ల పేర్లు ఫోన్‌ నెంబర్లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నాయి. అధికారులు స్పందించి సవరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Spread the love