గూగుల్‌తో పిచారుకు 20 ఏళ్ల బంధం

న్యూఢిల్లీ : గూగుల్‌ సిఇఒ సుందర్‌ పిచారు ఆ సంస్థలో చేరి 20 ఏళ్లు అయినట్లు తెలిపారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్‌ మేనేజర్‌గా గూగుల్‌లో తన తొలి రోజు ప్రారంభమయ్యిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ సంస్థలో చాలా మార్పులు జరిగాయన్నారు. సాంకేతికత, మా ఉత్పత్తులను ఉపయోగించే ప్రజల సంఖ్య సహా అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. తన జట్టులో కూడా మార్పులు వచ్చాయని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ గొప్ప సంస్థలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం తగ్గలేదన్నారు. 20 ఏళ్లలో అంచెలంచలుగా ఎదుగుతూ.. 2015లో సిఇఒగా పగ్గాలు చేపట్టారు.

Spread the love