నవతెలంగాణ – వలిగొండ రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పిసరి వెంకట్ రెడ్డి ఆత్మకూర్ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పిసరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా మరో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగబోతున్నారని కూడా ఇచ్చిన హామీలను, అతి తొందరలో ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తారని, పేద ప్రజలను కూడా ఆదుకుంటారని వారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నరేందర్ గుప్తా, బత్తిని ఉప్పలయ్య గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షుడు మంటిపల్లి సుధాకర్,కార్యదర్శి కావటీ బిక్షం, కావటి సూరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.