ఉపాధి హమీ పనులపై పర్యవేక్షణ కరువు

– కార్యాలయానికి పరిమితమైన వర్క్ ఇన్స్పెక్టర్లు..?
నవతెలంగాణ – అచ్చంపేట 
గ్రామీణ ప్రాంతాలలో వలసలు నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పనులను అచ్చంపేట మండలంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ గ్రామాలలో ఉపాధి కూలీలు చేసిన పనులను అంచనా వేయవలసిన వర్కు ఇనిస్పెక్టర్లు ఫీల్డ్ లోకి వెళ్లడం లేదని, కార్యాలయానికే పరిమితమేరని తెలుస్తుంది. అచ్చంపేట మండలంలో 11 మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇందులోనే ఒకరు ఇన్చార్జి ఈసీ గా మరొకరు ఇంచార్జ్  ఏపీవోగా విధులు నిర్వహిస్తున్నారు. మిగతా టెక్నికల్ అసిస్టెంట్లు ఒక్కొక్కరు నాలుగు 4,5 గ్రామపంచాయతీలు బాధ్యతలు చూస్తున్నారు. 38 గ్రామపంచాయతీలు, మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరం వరకు గ్రామాలు విస్తరించి ఉన్నాయి. ప్రతిరోజు వర్క్ ఇన్స్పెక్టర్ తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి పనులను పరిశీలిస్తున్నట్టు ఫోటో తీసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రూపులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కానీ గత 20 రోజులుగా ఒక్క టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఫోటోలో అప్లోడ్ చేయడం లేదని తెలుస్తుంది. కొందరు టెక్నికల్ అసిస్టెంట్లు స్థానికంగా చాలా ఏళ్లుగా  ఉంటున్నారు. రాజకీయంగా పలకబడి ఉండడంతో అధికారులు కూడా గట్టిగా పని చెప్పడానికి భయపడుతున్నారని తెలుస్తుంది.  ఏపీడి పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే ఉందని చర్చ జరుగుతుంది. ఈ విషయంపై మండల అభివృద్ధి అధికారి బాలచందర్ సృజన్ నవ తెలంగాణ వివరణ కోరగా. కచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేయాలని చెపుతున్నాను. ఎవరైతే ఫీల్డ్ మీదకు వెళ్ళని వారిని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాననీ తెలిపారు.
Spread the love