– లక్ష్మిపూర్ లో క్లోరోఫిల్ ఆర్గానిక్ ఎరువులపై రైతులకు అవగాహన
నవతెలంగాణ – బెజ్జంకి
వరి,పత్తి,కూరగాయల పంటల సాగును ఆశించే మోగి పురుగు,అగ్గి తెగులు,రసం పీల్చే,కాయ తొలుచు పురగుల నివారణకు చేపట్టే సస్యరక్షణకు క్లోరోఫిల్ ఆర్గానిక్ కంపెనీ ఎరువులు మేలు చేస్తాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజినల్ మేనేజర్ మహిపాల్ తెలిపారు.మంగళవారం మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలోని రైతులకు బస్టాండ్ అవరణం వద్ద క్లోరోఫిల్ ఆర్గానిక్ ఎరువులు పని చేసే విధానంపై మహిపాల్ రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. రైతులు రసాయనిక ఎరువులు,పురుగు మందుల నివారించి సేంద్రీయ ఎరువులపై దృష్టిసారించి భూసారాన్ని పెంపోదించుకోవాలని మహిపాల్ సూచించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఓ శంకర్,ప్రభుదేవా ఫర్టిలైజర్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ డీలర్ ముక్కీస యాకుభ్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,గ్రామ రైతులు హజరయ్యారు.