ఆంధ్రప్రదేశ్‌లోని PNG & CNG వినియోగదారులు ధర తగ్గింపును పొందవచ్చు

నవతెలంగాణ-హైదరాబాద్ : వినియోగదారులకు ప్రయోజనం కలిగించటం లో భాగంగా , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహజ వాయువు పై అదనపు విలువ ఆధారిత పన్ను (VAT)ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మరియు సహజ వాయువు వినియోగదారులు సంబరాలు చేసుకోవటానికి సరైన కారణం లభించింది. గతంలో 24.5%గా ఉన్న వ్యాట్ (VAT) రేటు ఇప్పుడు 5%కి తగ్గించబడింది. దీనితో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మరియు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ని ప్రస్తుత వినియోగదారులకు మరింత సరసమైనదిగా ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) చేసింది. రవాణా, పారిశ్రామిక మరియు వాణిజ్య రంగాలకు చెందిన సహజ వాయువు వినియోగదారులు CNG & PNG ప్రయోజనాలను పొందడానికి, ఈ ప్రాంతంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఈ తగ్గింపు ప్రకటనను ప్రభుత్వం చేసింది. 1 ఏప్రిల్ 2024 నుండి అమలులోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ముందు కిలోకు రూ. 93 ధర ఉన్న CNG ధరలు ఇప్పుడు కిలోకు దాదాపు రూ. 79కి చేరవచ్చు. ఈ నిర్ణయం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నేచురల్ గ్యాస్ (Natural Gas) ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ పరిణామంపై ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ అభిలేష్ గుప్తా గారు మాట్లాడుతూ, “ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వానికి మరియు సహజ వాయువుపై VATను 24.5% నుండి 5%కి తగ్గించడంలో భాగంగా తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదర్శప్రాయమైన నిర్ణయం, పర్యావరణ అనుకూల అభివృద్ధి దిశగా సరికొత్త మార్గాన్ని రూపొందించడానికి మరియు సహజ వాయువు ఆధారిత పారిశ్రామిక వృద్ధి పరంగా కొత్త యుగానికి నాంది పలికేందుకు మార్గం సుగమం చేసింది. పారిశ్రామిక అభివృద్ధి, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. VAT తగ్గింపు కోసం తీసుకున్న ఈ నిర్ణయం తో , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార సంస్థలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది, ఇది తయారీ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పారిశ్రామక వాడలు ఇతర రాష్ట్రాల్లోని తయారీదారులతో పోటీపడేలా చేస్తుంది. 1 ఏప్రిల్ 2024 తో ప్రారంభించి, పన్ను తగ్గింపు యొక్క మొత్తం ప్రయోజనాన్ని తుది వినియోగదారులకు ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) అందజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో CNG ధరల తగ్గుదల నిర్ణయం వాహనదారులకు ప్రయోజనం అందించటమే కాకుండా , ఇది అన్ని రకాల వాణిజ్య, తయారీ, నిర్మాణం, రియల్ ఎస్టేట్ మరియు రవాణా రంగాలు ఎటువంటి ఆర్థిక అడ్డంకులు లేకుండా సహజ వాయువు యొక్క నమ్మకమైన, సరసమైన ధరలతో కూడిన మరియు సురక్షితమైన ఇంధన వనరులకు మారడానికి వీలు కల్పిస్తుంది. ఈ నిర్ణయం పెరుగుతున్న కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడానికి కుడా తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని సహజవాయువు మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడం కోసం ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) దాని వాటాదారుల సహకారంతో పారిశ్రామిక వాడలలో గణనీయమైన ఎఫ్‌డిఐ(FDI)ని తీసుకురావడానికి ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) కృషి చేస్తుంది. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శ్రేయస్సును తీసుకురావడమే కాకుండా గణనీయమైన ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రగతిశీల దృక్పథానికి మేము మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము…” అని అన్నారు ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా PNG & CNG నిరంతరాయంగా సరఫరా చేయటానికి బలమైన నెట్‌వర్క్ మరియు మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. కంపెనీ రాష్ట్రం లో 50 కంటే ఎక్కువ CNG స్టేషన్లను నిర్వహిస్తోంది. ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) గురించి: ఇండియన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) పరిశ్రమలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గా ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) నిలిచింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు రాజస్థాన్‌ రాష్ట్రాలలోని 37 జిల్లాల్లో రోజువారీ ఉపయోగాల కోసం ప్రత్యేకంగా సహజ వాయువును అందించడానికి పెట్రోలియం & నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) అందించిన 12 CGD లైసెన్స్‌లను ఏజి&పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) కలిగి ఉంది. ఈ ప్రత్యేక హక్కులు ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరాను గృహాలకు, పారిశ్రామిక వాడలకు , వాణిజ్య, వాణిజ్యేతర అవసరాలకు మరియు వాహనాలలో ఉపయోగించడానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)ని కలిగి ఉంటాయి. ఈ CGD నెట్‌వర్క్‌లు 278,000 చదరపు కిలోమీటర్లు, 17,000 అంగుళాల-కిమీ పైప్‌లైన్ మరియు 1,500 కొత్త CNG స్టేషన్‌లను కవర్ చేస్తాయి.

Spread the love