నిమ్మ పెళ్లిలో పోలీస్ మీకోసం..

– జాబ్ మే లను సద్వినియోగం చేసుకోవాలి: డీఎస్పీ నాగేంద్ర చారి 
నవతెలంగాణ –  కోనరావుపేట

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మ పెళ్లి  గ్రామాల్లో   పోలీస్ మీకోసం అనే కార్యక్రమం డిఎస్పి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13న  జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా  కార్యక్రమాన్ని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గ్రామాల యువకులు చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఈ కార్యక్రమం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఈ జాబ్ మేళాకు 60 కంపెనీల సహాయంతో సుమారు 1000 కి పైగా జాబ్స్ తో యువతీ యువకులకు జాబ్ అందించాలని ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా యువతి యువకులు జాబ్ మేళాలో పాల్గొనాలని,  ఉద్యోగాలు పొందాలని అన్నారు.

Spread the love