లంచం తీసుకుంటు సీబీఐకి దొరికిన పోలీస్ ఆఫీసర్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ: దుకాణ యజమాని వద్ద లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడో పోలీస్‌ ఆఫీసర్. అక్రమ పార్కింగ్‌ వ్యవహారంలో ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్‌ అధికారి భీమ్‌ సింగ్‌ రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్‌ సీబీఐని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ పోలీస్‌ ఆఫీసర్‌ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని ధృవీకరించుకున్న సీబీఐ అధికారులు ఆ లంచావతారికి ఉచ్చు వేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆ పోలీసుకు డబ్బు ఇవ్వాలని షాపు యజమానికి సూచించారు. దీంతో అతడు పోలీసుకు డబ్బు ఇస్తుండగా పట్టుకున్నారు. అయితే పరిస్థితిని అర్థంచేసుకున్న అతడు.. అక్కడిని నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే చుట్టుముట్టిన సీబీఐ అధికారులు ఆ పోలీస్‌ ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదుచేశారు.

Spread the love