నేడు నూతన పార్లమెంట్‌ ను ప్రారంభించనున్న ప్రధాని

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోడీ సర్కార్‌ పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నేడు ప్రధాని మోడీ నూతన పార్లమెంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు ముఖ్య కేంద్రంగా నిలిచే పార్లమెంట్‌ నూతన భవనం విషయంలో మోడీ సర్కార్‌ వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణి వివాదాస్పదమైంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేకుండా చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించటంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Spread the love