ఢిల్లీలో పోలీసుల గస్తీ?

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలో నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు యత్నిస్తున్నారని ఆప్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. నగరంలోని ప్రధాన పైపులైన్లలో చాలా చోట్ల బోల్టులు తొలగించి ఉన్నట్లు గుర్తించామని మంత్రి అతిశీ తెలిపారు. దీంతో లీకేజీలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ క్రమంలో పైపులైన్ల వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు. కాగా యమునా నదికి ప్రవాహం తగ్గడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తింది.

Spread the love