మిర్చి రైతుల డబ్బులు పట్టుకున్న పోలీసులు

– మా మొర ఆలకించని పోలీసులు
– మిర్చి రైతుల ఆవేదన 
నవతెలంగాణ- ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండలానికి చెందిన తండ్రి కొడుకులు అయిన ఇద్దరు మిర్చి రైతుల డబ్బులు బుధవారం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇల్లందు పట్టణం రొంపేడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రైతుల కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున జామున మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు కల్తి మంగయ్య, కల్తి సత్యనారాయణ అనే రైతులు ఇటీవల పండించిన మిర్చి పంటను ఖమ్మం మిర్చి మార్కెట్లో అమ్మకానికి ఆళ్ళపల్లి ఓ బొలెరో వాహనంలో తీసుకెళ్లారు. అక్కడ తండ్రి కొడుకుల మిర్చి పంటకు సుమారు రూ.4,30,000/-లు రేటు రాగా వాటిని తీసుకుని వస్తున్న క్రమంలో మార్గమధ్యలో ఇల్లందు పట్టణం రొంపేడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారని మంగయ్య, సత్యనారాయణ తెలిపారు. ఆ పంట డబ్బులకు సంబంధించిన పత్రాలు చూపినా పోలీసులు మా మాటలు పెడచెవిన పెట్టారని వాపోయారు. కేవలం పోలీస్ ఉన్నతాధికారులు మెప్పు కోసమే చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు మా మొర ఆలకించకుండా మాతో ఇలా వ్యవహరించారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Spread the love