అమ్మవారి సేవలో తరింస్తున్న పోలీస్, సింగరేణి రెస్యూటీ దేవాదాయ ధర్మాదాయ, రెవెన్యూ సిబ్బంది

నవతెలంగాణ -తాడ్వాయి 
తెలంగాణ మహా కుంభమేళా అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లలో  వేచి చూస్తున్న చంటి పిల్లల తల్లులు ఎండ వేడి, ఉక్కపోతకి ఇబ్బంది పెడుతూ ఏడుస్తుంటే వారినీ ఎత్తుకొని కొద్దీ సేపు లాలించారు. క్యూలైన్లు రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఒత్తిడినీ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిత్యం మూడు షిఫ్టుల వారిగా విధులు నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. సింగరేణి కాలరీస్ రెస్కూ టీం, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అనారోగ్యం పాలైన భక్తులను వెంటనే ప్రథమ చికిత్స చేసి హాస్పటల్ కు తరలించారు. గద్దెల ప్రాంతంలో పోలీస్, సింగరేణి కలర్స్ టీం, దేవదాయ ధర్మాదాయ, రెవెన్యూ, సానిటేషన్ పంచాయతీరాజ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, తదితర ముఖ్యమైన శాఖల సేవలు అమోఘమైనవి.
Spread the love