ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలి

– జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి
నవతెలంగాణ- ములుగు
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శాసనసభ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతి నిధులతో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయు అభ్య ర్థులు ప్రచార సంబంధిత సభలు, ర్యాలీలు, సమావేశాలు, వాహ నాలు అనుమతి తీసుకోవాలన్నారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్‌ ఛానెల్‌లు, స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌ లు, సోషల్‌ మీడియా, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్‌ మీడి యాలతో సహా ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అను మతి సంబంధిత అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. 109 ములుగు నియోజకవర్గ పరిధిలో గల 9 మండ లాల్లో 7 మండలాలు వాజేడు, వెంకటాపురం 119 భద్రాచలం పరి ధిలో వస్తున్నాయని, ఈ మండలాల పరిధిలో అనుబంధ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు గురించి, చేంజ్‌ ఆఫ్‌ లొకేషన్‌ గురించి, ఐదు కిలో మీటర్ల కంటే దూరంగా ఉన్న ఓటర్ల కొరకు అదనపు పోలింగ్‌ కేం ద్రాల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నామి నేషన్‌ దాఖలు చేయు అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ఉండాలని, నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి 100 మీటర్ల రేడియస్‌ లోపు నామినేషన్‌ దాఖలు చేయు అభ్యర్థితో కలిపి 5 మందికి అనుమతి ఉంటుందని అన్నారు. మొత్తం 3 వాహనాలు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. ఒక్క అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love