
– నియోజకవర్గ స్థాయి గౌడ సంఘ సమావేశం
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: కరీంనగర్ మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు గౌడ కులస్తులకు చేసిందేమీ లేదని నియోజకవర్గ స్థాయి గౌడ కులస్తులు మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ లో పూదరి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గం గౌడ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి జెడ్పిటిసి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ హుస్నాబాద్ గౌడ కులస్తులను ఏనాడు పట్టించుకోలేదన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ గౌడ కులస్తుల మద్దతు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ , ఎమ్మెల్యే సతీష్ కుమార్ గౌడ కులస్తులకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌడ కులస్తులంతా బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కె మా మద్దతు ఉంటుందని, ప్రతి గౌడన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ కారు గుర్తుకే ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పూదరి రాజేశ్వరి గౌడ్, సర్పంచులు తోడేటి రమేష్, బొమ్మగాని రాజేష్, నియోజకవర్గ స్థాయి గౌడ సంఘ నాయకులు సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.