నవతెలంగాణ – పెద్దవూర
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రానికి చెందిన నడ్డి ఆంజనేయులు, విజయ లక్ష్మి దంపతులు కుమార్తే పూజిత బైపీసీ విభాగంలో జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించారు. పెద్దవూర మండలకేంద్రానికి చెందిన నడ్డి పూజిత తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మొత్తం మండల కేంద్రం లోని శాంతినీకేత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసింది. ఇంటర్ మీడియట్ నల్గొండ లోని గీతాంజలి కళాశాలలో చదివారు.ప్రథమ సంవత్సరంలోనూ జిల్లా లో అత్యుత్తమ ర్యాంకును సాధించిన పూజిత ద్వితీయ సంవత్సరంలోనూ అదే స్థాయిలో శ్రమించి 1000 మార్కులకు గాను ఏకంగా 984 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించారు.ప్రథమ, ద్వితీయ భాషలు మినహాయించి మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ మార్కులు సాధించారు.దింతో మండల ప్రజలు తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం హర్షం వ్యకం చేస్తున్నారు.