
ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే పోషణ పక్వాడ్ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని అంగన్ వాడి కేంద్రాల్లో పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని మహాదేవపూర్ సీడీపీఓ రాధిక ఆధ్వర్యంలో నిర్వహించిట్లుగా మండల సూపర్ వైజర్ సరస్వతి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడారు ప్రిస్కూల్ పిల్లలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరిని అంగన్ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అంగన్ వాడిల్లో చేర్పించిన చిన్నారులకు ప్రి స్కూల్ బుక్స్, ప్రొఫైల్స్, అభివృద్ధి చార్ట్, పిల్లల పర్యవేక్షణ కార్డు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మెటీరియల్ చిన్నారులకు మానసికంగా, ఆర్థికంగా, సాంఘిక స్థాయిని పెంచడానికి దోహదపడుతాయన్నారు. శిశువు పుట్టగానే ముర్రుపాలు పట్టిస్తే పోషకాలు అందుతాయన్నారు. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. ఆరు నెలలు దాటిన వెంటనే తల్లిపాలతోపాటు అంగన్ వాడిల్లో అందించే బాలామృతం,గుడ్లు పెట్టాలని,దీంతో చిన్నారులకు పోషకాలు అంది శారీరకంగా ఎదుగుదల,చదువుల్లో రాణించదానికి దోహదపడుతుందన్నారు. పోషణ పక్వాడ్ లో భాగంగా ప్రభుత్వం అంగన్ వాడిల్లో అందిస్తున్న పోషకాహారాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఏ స్వప్న, పంచాయతీ కార్యదర్శి శేఖర్, అంగన్ వాడి టీచర్లు,ఆయాలు పాల్గొన్నారు.