
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొత్తూరు, తాడ్వాయి సబ్ స్టేషన్ లలో మరమ్మతులు జరుగుతున్నాయి. కనుక రేపు శుక్రవారం నార్లాపూర్,కొత్తూరు, బయ్యక్కపేట, వెంగళాపూర్, ఎల్బాక, పడిగాపూర్,కాల్వపల్లి, తాడ్వాయి, నర్సింగాపూర్ కామారం, లవ్వాల,కొండపర్తి గ్రామాలలో ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 2.00. వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, టీఎస్ ఎన్పీడీసీఎల్ ఏఈ వేణు కుమార్ తెలిపారు.కొత్తూరు, తాడ్వాయి ప్రాంతంలో సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాంతంలోని గృహ, వ్యాపార, పరిశ్రమలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.