ప్రగతి శీలమీ’విశ్వగీతం’

ఆధునిక సమాజపు పోకడలను ఎలుగెత్తి గానం చేస్తున్న గేయ దశ్య కావ్యం ఈ ‘విశ్వగీతం’. సుప్రసిద్ధ సాహిత్యవేత్త చకిలం కొండల నాగేశ్వరరావు(చకొనా) రాసిన గేయ దశ్య కావ్యమిది. ఈ కావ్యంలోని దశ్యాలన్నీ మన కళ్ళకు కనిపించేవే. మనకెందుకులే అని వదిలేసినవే. అన్నీ అమానవీయ దశ్యాలే. చదువులెన్ని నేర్చినా మూఢనమ్మకాల కొనసాగింపే. అడుగడుగున ఒక మనిషిని వేరొక మనిషి దోచుకుంటున్న దశ్యాలే. రాజకీయాలు, కుట్రలు, దోపిళ్ళు నిత్య కత్యాలైన ఈ దేశపు అమానవీయ దశ్యాల మీద రగిలిన కవి గుండె గానం చేస్తున్న దశ్యగేయ కావ్యమిది. ఈ కావ్యం చదువుతుంటే పాఠకునికి ఎలుగెత్తి గానం చేయాలన్నంత ఉద్వేగానికి గురవుతాడు. ఆదిమకాలంలో అజ్ఞానం వల్ల మూఢ విశ్వాసాలు, నమ్మకాలు విస్తరించాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ, ఇన్ని చదువులు పెరిగిన ఈ కాలంలో రోజూ జరుగుతున్న రాక్షస కత్యాలు, అమానవీయ సంఘటనలు కవి గుండెను రగిలిస్తే జాలువారిన విశ్వగీతం ఇది.
చకొనా గతంలో కవిగా కవితా సంపుటాలు తెచ్చారు. నాటకాలు, నాటికలు రాశారు. న్యాయవాద వత్తిలో ఉంటూ కవి హదయాన్ని కాపాడుకుంటున్న సాహితీ వేత్త. అల్పాక్షరాలలో మాత్రా ఛందస్సులో ప్రవాహంలా సాగిన గేయ దశ్య కావ్యమిది. అరవై పేజీల ఈ గేయ దశ్య కావ్యం వర్తమాన సమాజ పోకడలను అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. కావ్యాలు, గేయ కావ్యాల రచనలు అరుదైన కాలంలో ఈ కావ్యం రావటం విశేషం. వీరి హదయంలోని కవితానలం ఎంతో అర్థం చేసుకోవడానికి ఈ గేయ పంక్తులను చదవండి..
”పులులన్నీ కలిసి పులిని/ కలనైనా వేటాడవు/ పశువుల మాంసాన్ని ఏ/ పశువైనా పట్టి తినదు/ మతిమాలిన జీవికైనా/ నీతి రీతి కన్పించును/ మనిషికిదేం తెగులొచ్చే/ మనిషిని మనిషే మ్రింగును” అంటాడీకవి.
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి

Spread the love