నవతెలంగాణ – హైదరాబాద్: ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనే వారికి సొంత వ్యాపారంతో అది సాధ్యమవుతుందని ఫ్రాంఛైజ్ బ్రిగేడ్ సీఈవో ప్రవీణ్ తెలిపారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో శనివారం భారతదేశపు ప్రీమియర్ మల్టీసిటీ ఫ్రాంచైజ్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రముఖ ఫ్రాంచైజ్ బిజినెస్ కన్సల్టేషన్ సంస్థ ఫ్రాంఛైజ్ బ్రిగేడ్ అన్నారు. ఫ్రాంచైజీ విస్తరణ, ఫ్రాంచైజ్ కన్సల్టింగ్, మార్కెటింగ్ వ్యూహాలు, విభిన్న పరిశ్రమలలో బ్రాండ్ బిల్డింగ్‌లో దశాబ్ద కాలంగా ముందంజలో ఉందన్నారు. దేశ, విదేశాలలో 1500పైగా ఫ్రాంచైజీలను విజయవంతంగా నియమించామన్నారు. క్రోమా, చాయ్ పాయింట్, వీవోసీ, బిగ్గీస్ బర్గర్, డోనర్ & గైరోస్, బారిస్టా, గ్రిల్ ఇండియా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫ్రోజెన్ బాటిల్ తదితర ప్రముఖ బ్రాండ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో గణనీయమైన పెరుగుదల చూశామన్నారు. తమ వ్యాపారాలు విస్తరించాలని చూస్తున్న వారు ప్రముఖ బ్రాండ్‌లతో నిమగ్నమయ్యే అవకాశాలను వెతుకుతున్నారని చెప్పారు. మా లక్ష్యం దేశ, విదేశీ బ్రాండ్‌ల నుంచి ఫ్రాంచైజ్ వ్యాపారాలు కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేయడం ద్వారా కొత్త యుగం వ్యవస్థాపకులను ప్రేరేపించడమేనన్నారు. తద్వారా దేశంలో ఆశాజనకమైన వ్యాపార అవకాశాలను కనుగొనడం, సహకరించడం, పెట్టుబడి పెట్టడం మా ఉద్దేశం అన్నారు. ఫ్రాంఛైజ్ బ్రిగేడ్తో కనెక్ట్ అవ్వడం అంటే సొంత యజమానిగా మారడమేనన్నారు. మీ నగరంలో మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీ భవిష్యత్తుకు బాధ్యత వహించవచ్చని తెలిపారు.