ప్రేమ వివాహం చేసుకున్న కూతురు.. ఊహించిని షాక్ ఇచ్చిన తల్లిదండ్రులు..!

నవతెలంగాణ – హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి విద్యా బుద్దులు నేర్పించి, ఈడుచ్చింది కదా అని ఓ మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. కన్నోళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా కన్నకూతురు ప్రేమించినోడిని మనువాడితే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. ఆ కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రులు గట్టి షాకే ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో మమత అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన రత్నాకర్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. దీంతో వాళ్లిద్దరూ ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. రత్నాకర్ ఇంటికి ఎవరైనా వెళ్లాలంటే మమత ఇల్లు దాటి వెళ్లాల్సిందే. ఇప్పటికే ప్రేమించినోడితో పెళ్లి చేసుకుందని రగిలిపోతున్న మమత తల్లి రత్నాకర్ ఇంటికి వెళ్లే దారిలో ఏకంగా గోడ కట్టేశారు. ఇది చూసిన గ్రామస్తులు రోడ్డుపై గోడ ఏంటని అవాక్కవుతుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి.

Spread the love