సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ తయారీ

– జీహెచ్‌ఎంసీ కార్మికులు విధులకు రాకున్నా హాజరైనట్టు నమోదు
– సర్కిల్‌ 14 శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌తో జీహెచ్‌ఎంసీ కార్మికులు విధులకు రాకున్నా హాజర్లు వేసి వేతనాలను కొట్టేస్తున్న జీహెచ్‌ఎంసీ(అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి) శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను నార్త్‌జోన్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి 22 సింథిటిక్‌ వేలిముద్రలు, బయో మెట్రిక్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకు న్నారు. శుక్రవారం సీసీఎస్‌ ఏసీపీ జీ.వెంకట ేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు ఫలుక్‌నుమాకు చెందిన సబావత్‌ రవికుమార్‌ జీహెచ్‌ఎంసీ గోషామహల్‌ సర్కిల్‌ 14లో అవుట్‌ సోర్సింగ్‌లో శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సు లువుగా డబ్బులు సంపాదించాలని అక్రమా లకు పాల్పడుతున్నాడు. జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న కొందరి కార్మికుల వేలి ముద్రలను సేకరించిన నిందితుడు సింథటిక్‌ (నకిలీ) వేలిముద్రలను తయారు చేశాడు. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 14లో పనిచేసే కొందరు కార్మికులు విధులకు హాజరుకాకున్నా విధులకు వచ్చినట్టు బయోమెట్రిక్‌ మిషన్‌ సహాయంతో హారైనట్టు వేస్తున్నాడు. కార్మికులకు వచ్చే వేతనాలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టేస్తున్నాడు. సమా చారం అందుకున్న నార్త్‌జోన్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ బీ.నర్సింహులు నేతృత్వంలో విచారణ చేప ట్టారు. విచారణలో నిందితుడు అక్రమాలకు పాల్పడుతున్నాడని తేలడంతో అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితున్ని మంగళ్‌హాట్‌ పోలీసులకు అప్పగించారు.

Spread the love