రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి..

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగాల్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అక్కడికి బయల్దేరినట్లు చెప్పారు.

Spread the love