ఇటలీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్: మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోడీ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఈ సాయంత్రం ఇటలీ పర్యటనకు బయల్దేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు. ఇటలీలోని ఏప్యూలియాలో జరిగే జీ7 అవుట్ రీచ్ సదస్సుకు నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ సదస్సు రేపు (జూన్ 14) జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా, నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం, తదితర రంగాలకు చెందిన అంశాలపై మోడీ, మెలోనీ చర్చించనున్నారు.

Spread the love