- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో శనివారం తెల్లవారుజామున 565వ జాతీయ రహదారిపై ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



