తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంకగాంధీ..

నవతెలంగాణ – తిరువనంతపురం: లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వయనాడ్‌ నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నారని ఇటీవల కాంగ్రెస్‌  ప్రకటించింది. ఇందులోభాగంగా ప్రియాంకకు మద్దతుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వయనాడ్‌లో ప్రచారం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో పోటీ చేసి రెండు స్థానాల్లోను భారీ మెజారిటీతో గెలుపొందారు. రెండు స్థానాల్లో గెలిచినవారు ఒక స్థానాన్ని వదులుకోవాలనే నియమం ప్రకారం ఆయన వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఈ స్థానంలో ప్రియాంక పోటీకి దిగుతున్నారు.

Spread the love