హుస్నాబాద్ లో ప్రియాంక బహిరంగ సభ వేలవేల  

– 40 వేల జనాభాను తరలించాలనే లక్ష్యం నెరవేరలేదు
– ప్రియాంక వచ్చేసరికి పట్టుమని 3 వేల మంది సభలో లేరు
– సభ ఫెల్ కావడంతో నిరాశకు లోనైన కాంగ్రెస్ వర్గాలు
– పొన్నం గెలుపుపై సందేహం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:  హుస్నాబాద్ పట్టణంలో  శుక్రవారం  నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ  విజయభేరి సభ జనం లేక వేలవేల పోయింది. జాతీయ నేత కావడంతో భారీగా జన సమీకరణ చేసి ఓట్లు దండుకోవలని చూసిన కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు సభ ఫెయిల్ కావడంతో నిరాశ మిగిలినట్టయింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి జనం సభ ప్రాంగణానికి వచ్చినప్పటికీ అనుకున్న సమయానికి ప్రియాంక గాంధీ రాకపోవడంతో జనం సభ ప్రారంభం కాకముందే వెళ్లిపోయారు. ప్రియాంక గాంధీ సభ వేదిక చేరుకునే సరికి కేవలం 3000 పైగా జనం ఉండడం గమనార్వం. అరగంట పాటు ప్రసంగించిన ప్రియాంక గాంధీ స్పీచ్ ను సభ ముందు ఉన్న కొద్దిపాటి జనం మాత్రమే విన్నారు. సభ వెనుక భాగంలో ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిచ్చాయి. ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న సమయంలో కూడా జనం సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవడం విశేషం. ఎంతో ఆర్భాటంగా సభను నిర్వహించి జనాలలో కార్యకర్తల్లో ఊపు తీసుకురావాలని భావించిన పొన్నం  ప్రభాకర్ కు ఈ సభ నిరాశ మిగిల్చింది. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు పై సందిగ్ధత ఏర్పడింది. సభ ఫెయిల్  కావడం జనం సభలో లేకపోవడం ఆ పార్టీ కార్యకర్తలలో కూడా నిరాశ మిగిల్చింది. పొన్నం గెలుపు సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలింగ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటం, భారీ అంచనాల తో నిర్వహించిన సభ ఫెల్ కావడంతో కాంగ్రెస్ వర్గాలలో ఆందోళన మొదలైంది. పొన్నం గెలుపు పై దాదాపు ఆశలు వదులుకున్నట్లు తెలుస్తుంది. ఇదే ఊపులో ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి  ప్రచారాన్ని ఉదృతంగా కొనసాగిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ సభ వైఫల్యంతో బీఆర్‌ఎస్‌అభ్యర్థి సతీష్ కుమార్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది.
Spread the love