రామ్ కోఠి త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో విద్యార్థుల ఇబ్బందులు..


– కథక్ నృత్య గురువు 3 నెలలుగా గైర్హాజరు 
– అయినా జీతం కోసం పైరవీలు?
నవతెలంగాణ -సుల్తాన్ బజార్: రామ్ కోఠి త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల లో కథక్ నృత్య గురువు సక్రమంగా విధుల కు రాకుండా, విద్యార్ధుల బోధనను గాలి కొదిలి జీతం కోసం పైరవీకి తెర లేపినట్లు విశ్వసనీయ సమా చారం. విధులకు గైర్హాజర్ అయినప్పటికీ తనకు జీ తం చెల్లించాల్సిందేనని కథక్ గురువు రాఘవ రాజ్ భట్ అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇందుకుగాను సదరు గురువు మంత్రుల పేషీ నుండి అధికారులకు ఫోన్ చేయించి, జీతం చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. అయితే వి ధులకు హాజరు కాకుండా జీతాల చెల్లింపు నిబంధన లకు విరుద్ధం కావడంతో ఉన్నతాధికారులు సైతం తమ చేతిలో ఏమీ లేదని చెప్పి చేతులె త్తేసినట్లు తెలి సింది. మంత్రుల పీఏలతో ఉన్నతాధికారులకు ఫోన్ చేయించి వత్తిడి తేవడంతో పాటు సంగీత కళాశాల సిబ్బందికి ఫోన్ చేసి తనకు జీతం చెల్లించేలా చూ డాలని, లేని పక్షంలో మీ సంగతి చూస్తానంటూ బె దిరింపులకు పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో విధులకు హాజరు కాకున్నా తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకొని మూడున్నర లక్షలు తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాలన్నిటిపై సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ పాండురంగ ముతాలిక్ వివరణ అడిగేందుకు ఫో న్ సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Spread the love