– ఉన్నత విద్యామండలి చైర్మెన్‌కు తెలంగాణ రిపబ్లికన్ పార్టీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యాజమాన్య కోటా (బీ కేటగిరీ)లో ఉన్న 30 శాతం సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయాలని తెలంగాణ రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నక్కా యాదీశ్వర్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సుల్లో యాజమాన్య కోటా కింద సీట్లను ప్రయివేటు కాలేజీలు ఇష్టారాజ్యంగా లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాయని విమర్శించారు. దీన్ని అరికట్టాలనీ, ఆ సీట్లనూ కన్వీనర్ కోటా ద్వారా ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని కోరారు.