అమ్మాయిలను రక్షిస్తే.. అమ్మను గౌరవించినట్లే

– ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ డాక్టర్ ఏ శరత్
– మేడారంలో ఘనంగా బాలిక దినోత్సవం వేడుకలు
నవతెలంగాణ- తాడ్వాయి 
అమ్మాయిలను రక్షిస్తే, అమ్మను గౌరవించినట్లే అని ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్ అన్నారు. మంగళవారం మేడారంలో మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి పి ప్రేమలత ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐటీడీఏ పీవో అంకిత్ జిల్లా ఎస్పీ శబరీష్ అధికారులతో కలిసి జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంత బాలికలని రక్షిద్దాం, చదివిద్దాం- బేటి బచావో, బేటి పడావో పోస్టర్లను, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ మాట్లాడుతూ బాలికలను సంరక్షించడం మన ప్రాథమిక బాధ్యత అని బాధ్యత గల ప్రతి అధికారి బాలికల సంరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఆడపిల్లని రక్షిస్తే అమ్మ నువ్వు గౌరవించినట్లేనని పేర్కొన్నారు. బాలికల సంరక్షణ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నటువంటి మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులను ప్రశంసించారు. బాలికల సౌరక్షణ కొరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల గ్రామాల్లో ఉన్న ప్రజలకు సంపూర్ణంగా బాలల హక్కులు సంరక్షణకే అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు రేఖ సిబ్బందితోపాటు జిల్లా సంక్షేమ అధికారి పి ప్రేమలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి జి ఓంకార్ సఖి సిబ్బంది కిరణ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love