డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు, భూములకు పరిహారం, ప్యాకేజి ఇప్పించండి

– తెలంగాణ రాష్ట్ర ఐటి,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్లకు వినపత్రం సమర్పించిన తాడిచెర్ల భూ నిర్వాసితులు 

నవ తెలంగాణ –  మల్హర్ రావు
తాడిచెర్ల కాపురం బ్లాక్-1ఓసీపీకి 500 మీటర్లు డేంజర్ జోన్లో ఉన్న సుమారుగా 2,800 ఇండ్లకు,భూములకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి, సురక్షితమైన ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేయించాలని తెలంగాణ ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతిపత్రాన్ని తాడిచెర్ల భూ నిర్వాసితులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు.  ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు టిఎస్ జెన్కో కంపెనీ ఇంటి నెంబర్లు కేటాయించి,14-12-2022న పలు దినపత్రికల్లో ప్లినిమరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇట్టి నోటిఫికేషన్ కాలపరిమిది 12 నెలలు మాత్రమే కానీ రెండు నెలలు కాలపరిమితి ఉండగానే సంబంధించిన జిల్లా కలెక్టర్ కు దృష్టికి తీసుకవెళ్లినట్లుగా తెలిపారు. దీనికి జిల్లా కలెక్టర్ జెన్కో కంపెనీ అధికారులు ఇంకా డబ్బులు వేయలేదని చెప్పడం జరిగిందన్నారు. ఇట్టి విషయంపై తమ దృష్టికి తీసుకరాగ జెన్కో సిఎండితో గతంలో ఫోన్లో సంప్రదించగా బడ్జెట్ లేదు కావున ఇప్పట్లో కాదని సమాధానం చెప్పడం జరిగిందని మంత్రికి వివరించారు. తాడిచెర్ల ఓసిపిలో బ్లాస్టింగ్ బాంబుల దెబ్బలతో ఇండ్లు నెలమట్టమై, ఇంటి గోడలు భారీగా పగుళ్లు తెలుతున్నాయని,బ్లాస్టింగ్ వల రసాయన విషపు వాయువుతో ప్రజలకు ఊపిరితిత్తుల,క్యాన్సర్,గుండె జబ్బులు తదితర వ్యాధుల బారిన పడి చనిపోతున్నారని వాపోయారు.గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని,మొదటి నుంచి భూనిర్వాసితుల సమస్యలు తమకు తెలుసు కనుక త్వరగా నిర్వాసితుల సమస్యలను పరిస్కార మార్గం చూపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో భూనిర్వాసితులు కేశారపు చెంద్రయ్య, తాండ్ర మల్లేష్,ఇందారపు చెంద్రయ్య, బండి రాజయ్య,ఇందారపు సారయ్య, తాండ్ర సదయ్య పాల్గొన్నారు.
Spread the love