ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసమే ప్రజా పాలన..

– భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్..
నవతెలంగాణ భువనగిరి రూరల్ 
ఆరు గ్యారంటీల పథకాలు అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని నమత్  పెల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగు ముఖ్యఅతిథిగా ఎంపీపీ హాజరై, మాట్లాడారు. ప్రజలందరూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగస్వాములై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రజా పాలన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సబ్బురు బీరు మల్లయ్య, నమాత్  పల్లి గ్రామ సర్పంచ్ ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి, ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్ బాబు, ఎంపీడీవో గుత్తా నరేందర్ రెడ్డి, తాసిల్దార్ అంజిరెడ్డి, వార్డు సభ్యులు, ప్రజలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love