
నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన సదస్సులో భాగంగా గురువారం నాడు మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో ప్రజా పాలన సదస్సు ఆ గ్రామ సర్పంచ్ గంగాబాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాబాయి ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ గ్రామ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా పాలన సదస్సులు ప్రజల కోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీ అమలు కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ఎంపీటీసీ ఆ గ్రామ పెద్దలు మనోహర్ దేశాయ్ గ్రామస్తులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.