ప్రజా పాలనతో సకల జనులకు మేలు

– పార్టీలకతీతంగా సంక్షేమ పథకాల అమలు

– పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ-పెద్దవంగర: ప్రజా పాలనతో సకల జనులకు మేలు కలిగేలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఎల్బీ తండా, బీసీ తండా, బావోజీ తండా, రెడ్డికుంట తండాల్లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. బావోజీ తండాలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లోని ప్రతి పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దొరల పాలన కాదని, ప్రజా పాలన అని అన్నారు. ప్రజల ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల దగ్గరికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు అర్హత ఉన్న వారందరూ ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. ప్రజా పాలనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలకు కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. కాగా ప్రజా పాలన కార్యక్రమం వచ్చే నెల 6 వరకు కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గ్రామ సభల్లో సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున మొత్తం మండలంలో 101 ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా 417 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్, తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంపీఓ సత్యనారాయణ, పీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సర్పంచ్ లు తారా ఫుల్ సింగ్, పద్మ దేవేందర్, బానోత్ జగ్గా నాయక్, బానోత్ జమున గోపాల్, ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ యాదవ్, దుంపల శ్యాం, మండల యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షుడు అనపురం వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love