– అనునిత్యం ప్రజా సేవలోనే ఉంటా : శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
మానవసేవే మాధవసేవ అని పెద్దలు చెప్పినట్లుగా ప్రజాసేవ ఎనలేని సంతృప్తినిస్తుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఎస్ఆర్ఆర్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు బ్యాటరీ వాహనాలు పంపిణీ చేయగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేయగా కోలాట ఆటపాటలు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలి అన్నారు. ఎస్ఆర్ఆర్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని కొనియాడారు. సేవ గుణాన్ని కలిగి ఉన్న శ్రీనివాస్ రెడ్డి రాయపర్తి మండల వాస్తవ్యుడు కావడం అదృష్టమని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
అనునిత్యం ప్రజా సేవలోనే ఉంటా
అనునిత్యం ప్రజా సేవలోనే ఉంటా అని ఎస్ఆర్ఆర్ సంస్థ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు బ్యాటరీ వాహనాలు ఇవ్వడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయం నుంచి 30 శాతం ప్రజా సేవ కోసమే ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. పురాతనమైన దేవాలయాలను, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పాఠశాలలను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలకు ఎనలేని సహకారాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. వీరి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కక్కిరాల హరిప్రసాద్, కృష్ణమాచార్యులు, మహేందర్ రెడ్డి, మాచర్ల ప్రభాకర్, సరికొండ కృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుంట రమేష్, కుందూరు రామ్ రెడ్డి, ఉల్లంగల నర్సయ్య, ఉల్లంగల యాదగిరి, ముద్రబోయిన వెంకన్న, సుదర్శన్ రెడ్డి, ఈరెడ్డి నరసింహారెడ్డి, గూగులోతు శీను, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.