నవతెలంగాణ-పెద్దవంగర: కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ముత్యాల పూర్ణచందర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ..తన సేవలను గుర్తించిన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. తన నియామకానికి సహకరించిన డీసీసీ అధ్యక్షుడు, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధికారమే లక్ష్యంగా తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.