పీవీకీ భారత రత్న కరీంనగర్ కు దక్కిన కీర్తికీరిటం 

– యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శ్రావణ్ హర్షం 
– యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో సంబురాలు
నవతెలంగాణ – బెజ్జంకి 
మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత భారత రత్న పురస్కారం ప్రకటించడం కరీంనగర్ జిల్లాకు దక్కిన కీర్తికీరిటమని యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శానకొండ శ్రావణ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణం వద్ద యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో ప్రజలకు స్వీట్స్ పంపిణీ చేసి సంబురాలు జరిపారు.కాంగ్రెస్ నాయకులు ముక్కీస రత్నాకర్ రెడ్డి,బోనగిరి రాజేందర్, మంకాల ప్రవీన్,ఐలేని శ్రీనివాస్ రెడ్డి, రొడ్డ మల్లేశం, డీవీ రావు, మధు సూదన్ రెడ్డి, చెన్నారెడ్డి, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య తదితరులు హజరయ్యారు
కేకేసీ తెలంగాణ హర్షం..

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం హర్షణీయమని కేకేసీ తెలంగాణ సోషల్ మీడియా కో ఆర్డీనేటర్ మెట్ట నాగారాజు ఆనందం వ్యక్తం చేశారు.తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహ రావుకు భారత రత్న వరించడం తెలంగాణ రాష్ట్రానికి శుభపరిణామమని నాగారాజు అన్నారు.

Spread the love