ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి
    నవతెలంగాణ నెల్లికుదురు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వారికి అన్ని రకాల వసతులకు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరానికి అడ్మిషన్లు పొందాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరిగేకుటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు విశాలమైన తరగతి గదులు అధునాతనమైన లాబరేటరీలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆటలు మరియు జాతీయ సేవలో భాగంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ అనేక వసతులతో కూడిన నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరి వారి ఉజ్వల భవిష్యత్తుకు చక్కటి మార్గం వేసుకోగలరని కోరారు ఈ కళాశాలలో అన్ని రకాల కోర్సులు ఉన్నాయని వీటిని ప్రతి ఒక్కరు సద్విని చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ముక్కెర ప్రకాష్ బాబు కందికొండ బాబు భూక్య నాగేశ్వరరావు కక్కర్ల రామ్మూర్తి కూన సతీష్ ఆనమాల్ల సుధాకర్ దేశెట్టి యాకన్న ధూపటి శ్రీనివాస్ లాడే మహేందర్ పాల్గొన్నారు
Spread the love