నవతెలంగాణ – పెద్దవూర
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సహాయ గిరిజన అభివృద్ధి అధికారి ఏటీడీఓ ఎం .శ్రీనివాస్ అన్నారు. గురువారం పెద్దవూర మండల కేంద్రం లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, హాస్టల్ సిబ్బందికి సం బంధించిన హాజరు పట్టికలు, రికార్డులు, వం టగది, భోజనాలు, మూత్రశాలలు, పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. వార్డెన్లు స్థానికంగా ఉండా లని సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్యూటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. అంటువ్యాధులు ప్రభలకుండా వంటగది, హాస్టల్ పరిసరాల్లో బ్లీచింగ్
పౌడర్ చల్లాలని, నీరు నిల్వ ఉండకుండా చూడా లని తెలిపారు. ఆయన ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్,హస్టల్ వార్డెన్ కొల్లు బాలకృష్ణ సిబ్బంది ఉన్నారు.