నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానుండటంతో దీనికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. రాహుల్ గాంధీ ఉదయం 8:40 గంటలకు విమానంలో చెన్నై చేరుకుంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటన, ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ, ప్రాంతీయ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.
విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



