Sunday, May 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబావిలో దూడను కాపాడి.. తండ్రీకొడుకులు మృతి

బావిలో దూడను కాపాడి.. తండ్రీకొడుకులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలో పడిపోయిన లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. రైతు రోసపుల్ల రాజు (41) బావిలోకి దిగి దూడను రక్షించగా, బయటకు వస్తుండగా విషవాయువుల ప్రభావంతో మళ్లీ బావిలో పడిపోయాడు. తండ్రిని కాపాడేందుకు కుమారుడు పవన్‌కుమార్‌ (21) కూడా బావిలోకి దిగాడు. అయితే బావిలో ఆక్సిజన్ లేకపోవడంతో ఇద్దరూ అస్వస్థతకు గురై నీటిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -