Wednesday, August 19, 2026
E-PAPER
Homeజిల్లాలుపాలిటెక్నిక్ విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ

పాలిటెక్నిక్ విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
పాలిటెక్నిక్ కళాశాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం పరకాల పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పరకాల పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సుమారు 250 మంది విద్యార్థులతో ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి బొచ్చు ఈశ్వర్, పరకాల పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్ మాట్లాడుతూ శక్తి పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఎస్‌బీటీఈటీ బోర్డును మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలల్లో హాస్టళ్లు, ల్యాబ్‌లు, భవనాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. అధ్యాపకులు, సిబ్బంది సర్వీస్ నిబంధనలకు రక్షణ కల్పించాలని అన్నారు.పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కోకిల సాయి తేజ, పట్టణ కార్యదర్శి ఎం.డి. అఫ్రోజ్, నాయకులు విక్కీ, ప్రశాంత్, రాహుల్, నాగరాజు, అభినవ్, బన్నీతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -