Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాలలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

పరకాలలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలోని డివిజన్, రూరల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులు అబ్బాడి రవీందర్‌రెడ్డి, చిట్టిరెడ్డి రవీందర్‌రెడ్డి, ఆకుల శ్రీధర్, కొడపాక భాస్కర్, బండారి గిరిప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొని ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరకాల పట్టణ అధ్యక్షుడు వేముల సుధాకర్, గౌరవ అధ్యక్షుడు కుడికాల సత్యనారాయణ, కోశాధికారి గుండేడి అశోక్, ఉపాధ్యక్షుడు చెందుపట్ల బాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శామంతుల రాజుతో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల ఐక్యతను చాటుతూ వేడుకలు నిర్వహించారు. 1839 ఆగస్టు 19న లూయిస్ డాగ్యురే అభివృద్ధి చేసిన డాగ్యురియోటైప్ ప్రక్రియకు సంబంధించిన చారిత్రక ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ ఫోటోగ్రఫీ ప్రపంచానికి వెలుగుదివ్వెగా నిలిచిందని ఫోటోగ్రాఫర్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -