Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు 

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో   దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ  కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. జడ్చర్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిలు, గడ్డల విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, కృష్ణయ్య గౌడ్,  కంచనపల్లి నరసింహులు,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్  మండల అధ్యక్షులు చెన్నయ్య, రఘుపతి రెడ్డి, భాస్కర్ నాయక్, దానియేలు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -