– జస్ట్ రీడర్… : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీసీసీ చీఫ్ రేవంత్ బ్యాచ్ రాసిచ్చే స్పీచ్‌నే సభల్లో చదువుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసలు లీడరే కాదనీ, ఆయన కేవలం రీడర్ మాత్రమేనని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికలనగానే ఢిల్లీ నుంచి రాబందుల్లా తెలంగాణకు కాంగ్రెస్ నేతలు వచ్చి వాలుతున్నారంటూ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీ గెలిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ చెబుతున్న రాహుల్… అసలు ఏ హోదాతో ఆ మాట చెబుతున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేనా..? లేక ప్రియాంకా గాంధీయా..? లేక రాహుల్ గాంధీయా..? అంటూ ఎద్దేవా చేశారు.