వర్షాకాలం పప్పులు, మసాలాలు పాడవకుండా…

వర్షాకాలం పప్పులు, మసాలాలు పాడవకుండా...చిరుజల్లుల రాకతో మండే వేసవి నుంచి ఉపశమన లభిస్తుంది, మనస్సుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే… వాతావరణంలో అధిక తేమ కారణంగా.. వంట సామాగ్రి త్వరగా పాడవుతూ ఉంటాయి. తేమ కారణంగా పప్పులు, మసాలా దినుసులు, పిండులు పురుగులు పట్టడం, గడ్డలుగా మారడం, బూజు పట్టి చెడిపోతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల కారణంగా డబ్బు, సమయం రెండూ వృథా అవుతాయి. ఈ సీజన్‌లో వంట సరకులు, పిండ్లు, మసాలాలు, పప్పులను ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి, పాడవకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను చూద్దాం..
ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో స్టోర్‌ చేయండి..
మసాలాలు, పిండ్లు, పప్పులను ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో నిల్వ చేస్తే.. అవి పాడవకుండా కాపాడుకోవచ్చు. మూతలు టైట్‌గా ఉండే గాలి చొరబడని గాజు, ప్లాస్టిక్‌ కంటైనర్లను సెలెక్ట్‌ చేసుకోండి. గాజు డబ్బాలైతే ఇంకా బెస్ట్‌. ఎందుకంటే అవి నాన్‌-రియాక్టివ్‌, తేమ లోనికి రాకుండా రక్షిస్తాయి. ఈ డబ్బాల్లో పిండ్లు, మసాలాలు, పంచదార వంటి వేసే ముందు వాటిని శుభ్రం చేసి, పూర్తిగా ఆరినివ్వండి.
తేమ ప్రాంతాలకు దూరంగా ఉంచండి..
వంట గది కిటికీలు, సింక్‌లు, స్టవ్‌టాప్‌ల దగ్గర తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల దగ్గరలో పప్పులు, సుగంధ ద్రవ్యాలు, చక్కెర వంటివి నిల్వ ఉంచొద్దు. ఎందుకంటే.. అవి తేమకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి బదులుగా ప్రత్యక్ష సూర్యకాంతి లేని చోట, తడి లేని చోట వీటిని ఉంచండి. పొడి ప్రదేశంలో పప్పు, పిండి డబ్బాలు ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
తక్కువ పరిమాణంలో..
వర్షకాలంలో తక్కువ పరిమాణంలో సరుకులు కొనుగోలు చేయండి. ఇలా చేస్తే.. సరుకు పాడవ్వకుండా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటే.. తేమ కారణంగా పురుగు, బూజు పట్టే అవకాశం ఉంది. సుగంధ ద్రవ్యాలు, చక్కెర వాటి పరిసరాల నుంచి తేమను ఎక్కువగా గ్రహిస్తాయి. తేమ బదిలీని నిరోధించడానికి, ప్రతి పదార్ధానికి ప్రత్యేక స్పూన్లు, ఉపయోగించండి. వీటిని ముట్టుకనే ముందు మీ చేతులకు తడి లేకుండా శుభ్రంగా క్లాత్‌తో తుడుచుకోండి.
తరచు చెక్‌ చేయండి..
మసాలాలు, పిండ్లు, పప్పులను తరచు చెక్‌ చేస్తూ ఉండాలి. వాటిలో పురుగులు, రంగు మారడం, వాసన రావడం, తేమగా ఉండటం వంటివి గమనిస్తే.. పైభాగాన్ని వేరు చేసి మంచివి వేరే కంటైనర్‌లో ఉంచండి. వాటిని ఎండలో ఉంచినా.. పాడవకుండా రక్షించుకోవచ్చు.
సిలికా జెల్‌ ప్యాక్‌లను వాడండి..
మసాలా, చక్కెర, పప్పుల డబ్బాలో సిలికా జెల్‌ ప్యాక్‌లను వేయండి. సిలికా జెల్‌ తడిని పీల్చుకుంటుంది, వస్తువులు త్వరగా పాడవకుండా కాపాడుతుంది.

Spread the love