రాజగోపాల్ రెడ్డి పదవుల కోసం పోరాడే వ్యక్తిని కాదు

– ప్రజా సమస్యల మీద పోరాడే శక్తిని
– మునుగోడు నియోజకవర్గం కు రాజకీయ చైతన్యం ఎక్కువ..
– మునుగోడుకు పోరాటాల గడ్డ అనే చరిత్ర ఉంది..
– నా బలం బలగం మునుగోడు నియోజకవర్గం ప్రజలే…
– పార్లమెంట్ ఫలితాలలో మునుగోడు నియోజకవర్గం నుండి అధిక మెజార్టీ ఉండాలి..
నవతెలంగాణ – మునుగోడు
నా బలం.. బలగం మునుగోడు నియోజకవర్గ  ప్రజలు అని , పదవుల కోసం పోరాడే వ్యక్తి కాదు  ప్రజా సమస్యల మీద పోరాడే శక్తినని భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రత్యేక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ కమిటీల ఇన్చార్జి , బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 119 నియోజవర్గాలలో కంటే  మునుగోడు నియోజకవర్గానికి రాజకీయ చైతన్యం ఎక్కువ అని  మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర లో నిలిచిపోయే విధంగా జరిగిన పోరులో మునుగోడు కు పోరాటాల గడ్డ అని పేరు వచ్చిందని అన్నారు.  పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో అన్ని నియోజకవర్గాల కంటే అత్యధిక మెజార్టీ మునుగోడు నియోజకవర్గం నుండి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, భూత్ ఇన్చార్జులు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని అన్నారు. స్థానిక ఎన్నికలలో కష్టపడిన వారికే అవకాశాలు ఉంటాయి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం బీజేపీ బీఆర్ఎస్ నుండి పార్టీలో చేరేందుకు గ్రామస్థాయిలలోనే బూత్ ఇన్చార్జీలు బూత్ సభ్యులు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర నాయకులు నార బోయిన రవి ముదిరాజ్ , మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సంద్య రెడ్డి, మండల ఎన్నికల ఇన్చార్జి కొలను రాజేందర్ రెడ్డి , మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ , సీనియర్ నాయకులు పోలగోని సత్యం , నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి , బూడిద లింగయ్య యాదవ్ , అనంత  స్వామి గౌడ్ , మేడి యాదయ్య , జాల వెంకన్న యాదవ్ తదితరులు ఉన్నారు .
Spread the love