సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మేల్యే రాజగోపాల్ రెడ్డి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో తంగడపల్లి రోడ్డు నుండి బంగారిగడ్డ వరకు సీసీ రోడ్డును శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రూ.1 కోటి రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు శిలాఫలకాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీని మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. కౌన్సిలర్లు ఏ పార్టీ అని చూడకుండా అందరికీ సమన్యాయంగా అభివృద్ధి నిధులు కేటాయిస్తానని అన్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ ఈరోజు నుంచే ప్రతి వార్డుకు అధికార,ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా  కౌన్సిలర్లకు సమానంగా నిధులు కేటాయించాలని సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు అవసరం లేదు రాజకీయాలు వచ్చినప్పుడు చూసుకుందాం అని రాజగోపాల్ రెడ్డి ప్రజలతో చెప్పారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి చేస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెండి రాజు వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ వార్డు కౌన్సిలర్లు బాబా షరీఫ్,సందగళ్ళ విజయసతీష్ గౌడ్,ఉబ్బు వరమ్మవెంకటయ్య,కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి,కొయ్యడ సైదులు గౌడ్, కామిశెట్టి శైలజ భాస్కర్,నాగరాజు,కొరగోని లింగస్వామి, బండమీది మల్లేష్ మున్సిపల్ కమిషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి,పంచాయతీ రాజ్ డీఈ బాలచందర్ నాయకులు  హన్నుబాయ్,పిల్లలమరి శ్రీనివాస్ నేత,మాజీ ఎంపీపీ చిక్క నరసింహ,చింతల వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్,ఎండి జానీ బాబు,రహీం పాషా,చింతల సాయిలు,తిరుపతి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love