– మాజీ పీఏపీఎస్ డైరెక్టర్ వేపిరెడ్డి జితేందర్ రెడ్డి ..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి లక్ష్యం మెజార్టీ రావాలన్నదే లక్ష్యంగా భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ జిల్లా నాయకులు, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ వేపిరెడ్డి జితేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చల్మెడ గ్రామంలోనివేమిరెడ్డి లింగారెడ్డి నగర్, చౌడుచింత లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పాలించాయని మండిపడ్డారు. పేద ప్రజల సంక్షేమం సబండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచాలన్నదే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం అని అన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు చేయి గుర్తుపై ఓటు వేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో బతరాజు సత్యం , కొంక చంద్రయ్య , కొంక శంకర్ , కర్నాటి రామకృష్ణ , ఉప్పరబోయిన నరసింహ, గుండెబోయిన నరసింహ, రమేష్ యాదవ్, వెంకట్ యాదవ్, నర్సింహా యాదవ్, శివ యాదవ్, ప్రభాకర్, పెంటయ్య, నర్సింహా సీపీఐ నాయకులు లాలు, యాదయ్య ముదిరాజ్, యాదయ్య, దశరథ్ ముదిరాజ్, మల్లికార్జున్ గౌడ్, లాలు గౌడ్ తదితరులు ఉన్నారు.